Green Man of India Ankarao watering young saplings in a forest restoration area.
ఒక్ర చెట్టు అంతరిస్తే కేవలం ఒక మొక్కనే కాదు, ఒక చిన్న పర్యావరణ వ్యవస్థను కోల్పోతాం. అలాగే... ఒక చెట్టును కాపాడితే కేవలం చెట్టును కాదు... భవిష్యత్ తరాల జీవితాన్నిరక్షించి నట్టే.
తన జీవితాన్నే ప్రకృతికి అంకితం చేసి, కోటి విత్తన బంతులు చల్లి పచ్చదనానికి ప్రాణం పోసిన “గ్రీన్‌మ్యాన్ ఆఫ్ ఇండియా” అంకారావును మనం ఎలా గౌరవించాలి?
గత సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఆయనను వేదికపైకి ఆహ్వానించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
కానీ ఈ కథలో ఒక బాధాకరమైన నిజం కూడా ఉంది.
ముఖ్యమంత్రి బహిరంగంగా ఇచ్చిన మాట ఇప్పటికీ అధికారుల ఫైళ్లలోనే చిక్కుకుపోయింది. ఏడాది గడిచినా ఆ జీఓ అమలు కాలేదు. గౌరవం దక్కాల్సిన చోట వివక్ష ఎదురైంది. గుర్తింపు రావాల్సిన చోట అవమానం మిగిలింది.
అయినా... అంకారావు ఆవేదనను అడవిపై చూపలేదు.
నిరాశను ప్రకృతిపై తీర్చుకోలేదు.
ప్రభుత్వం మాట తప్పినా,ఆయన చేతులు ఆగలేదు. అడవి వైపు అడుగులు ఆగలేదు.
ఇప్పటికీ అడవిలోనే ఉన్నాడు.
తన బిడ్డల్లా పెంచుకున్న మొక్కలకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు.
మనుషులు మాటలు మరిచిపోవచ్చు... కానీ ప్రకృతి తన కోసం నిస్వార్థంగా శ్రమించిన వారిని ఎన్నటికీ మర్చిపోదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబడక పోయినా, అంకారావు మాత్రం ప్రకృతికి ఇచ్చిన మాటను ఈ రోజుకీ నిలబెడుతూనే ఉన్నాడు. Full Video - https://youtu.be/9ZWeWdb5Lnw
- శ్యాంమోహన్.
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి