30, మే 2026, శనివారం

ప్రభుత్వాలను కదిలించిన రూరల్ మీడియా! How Rural Media Stories Moved Governments and Changed Lives in India

 

                    Shyam Mohan is learning about the problems of farmers in Marlapadu Thanda.  
 నిజమైన జర్నలిజం స్టూడియో లైట్ల కింద, యాంకర్ డెస్క్‌లపై పుట్టదు. అది రహదారులు లేని ఆవాసాల్లో, మండుటెండలో కష్టపడే రైతు చెమటలో ఉంటుంది. టెలిప్రాంప్టర్ చదివే మాటల్లో భావోద్వేగం ఉండవచ్చు, కానీ జీవం ఉండదు. ఆ జీవం తెలుసుకోవాలంటే విద్యుత్ వెలుగులేని పల్లెల్లో అడుగుపెట్టాలి... నీటి కోసం కిలోమీటర్లు నడిచే మహిళల నిశ్శబ్దాన్ని వినాలి...               అభివృద్ధి పేరుతో కూలిపోతున్న మహావృక్షాల గాయాలను చూడాలి. అక్కడే నిజాలు మాట్లాడతాయి. అక్కడే కథలు కేకలు వేస్తాయి. అక్కడే అసలైన జర్నలిజం జీవిస్తుంది. 

 ప్రభుత్వాలు, ఎన్జీఓలను కదిలించిన కథనాలు 

1, ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం సమీపంలోని ఒక కుగ్రామంలో రహదారి సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఎదొర్కొంటున్న సమస్యల పై వీడియోలు చేసినపుడు ITDA  స్పందించి అక్కడ రహదారి వేయించి, తాగునీటి సౌకర్యం కల్పించారు.                                                                    2, నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలంలోని నక్కల గండి రిజర్వాయర్ సమీపంలోని మర్లపాడు తండా ఒక రాత్రి వరద నీటికి మునిగిపోయింది. ఎవరూ పట్టించుకోని ఈ తండాకు వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ చేశాక జిల్లా కలెక్టర్ బదావత్ సంతోషి ఆ తండాను సందర్శించి వారికి వేరేచోట కొత్త కాలనీ కట్టిస్తానని హామీ ఇచ్చారు.   

 3, ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌జిల్లా) సమీపం గట్టేపల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీళ్లు లేక పంటలు వేయడమే కాదు, మరుగు దొడ్లు కూడా నిర్మించుకోక బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారు. బోర్లు ,బావులు ఎండి పోయిన పరిస్ధితి. దానికి కారణం వర్షపాతం ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా భూమిలోకి ఇంక కుండా దిగువన ఉన్న ప్రాంతాలకు పోయేది. ఆలాంటి పరిస్ధితును స్టడీ చేసి స్టోరీ చేశాం. ఏకలవ్య ఫౌండేషన్ సంస్ధ స్పందించి ఆ ప్రాంతంలో వాటర్ షెడ్ కార్యక్రమం అమలు చేసి, భూగర్భ జలాలు పెంచారు. 

 4, కొత్త గూడెం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది క్రాంతినగర్ ఆవాసం. అక్కడ సోడి గంగ అనే 75 ఏండ్ల వృద్ధుడుకి ఇప్పటి వరకు కాళ్లకు చెప్పులు ఎలా ఉంటాయో తెలీదు. వంటి మీద చొక్క కూడా ఎపుడూ వేసుకోలేదు. ఎండైనా వానైనా అలాగే పొలం  పనులు చేసుకుంటాడు. కారణం పేదరికం. వీడియో చేశాం. దానికి స్పందించిన తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ ప్రాంతంలో పేదరికం , ఆర్ధిక సామాజిక పరిస్ధితులను అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి నోటీస్‌లు పంపారు.

 5, భూపాల్‌పల్లి జిల్లా మహా ముత్తారం గిరిజన ఆవాసాల్లో వైద్య సదుపాయాలు లేక రోగులను డోలీలో మోసుకొని వెళ్తూ వాగు దాటుతున్న దృశ్యాలను వీడియో స్టోరీ చేశాక , వరంగల్‌లో వైద్యవిద్యార్ధులు స్సందించి ఆ ప్రాంతాలను పరిశీలించి ఇపుడు తరుచూ ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 

6, సీతం పేట గిరిజన ప్రాంతాల్లో రహదారలు లేని చోట ఏర్పాటు చేసిన బైక్ ఆంబులెన్స్‌ల పై 2018లో బిబిసి లో రాసిన కథనాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందిస్తూ రిట్వీట్ చేశారు.                                                                                                                                                  -ShyamMohan  ( youtube.com/@RuralMedia )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రభుత్వాలను కదిలించిన రూరల్ మీడియా! How Rural Media Stories Moved Governments and Changed Lives in India

                      Shyam Mohan is learning about the problems of farmers in Marlapadu Thanda.    నిజమైన జర్నలిజం స్టూడియో లైట్ల కింద, యా...